తమిళనాడులో లాక్​ డౌన్​ పొడిగింపు..

జూన్ 14 వరకు లాక్ డౌన్
సడలింపులనూ ప్రకటించిన ప్రభుత్వం

చెన్నై: లాక్ డౌన్ ను మరో వారం తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చినా.. మరింత కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు స్టాలిన్ సర్కార్ ప్రకటించింది. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష చేసిన మరుసటి రోజే లాక్ డౌన్ ను పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది.

లాక్ డౌన్ పొడిగింపుతో పాటు కొన్ని సడలింపులను ఇచ్చింది. చెన్నైకి మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలకు అన్ని జిల్లాల్లోనూ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. 11 జిల్లాల్లో కరోనా కేసులు ఇంకా ఎక్కువగానే వస్తున్నా.. ప్రజల అవసరాల దృష్ట్యా ఆయా జిల్లాల్లోనూ సడలింపులను ప్రకటించింది. అందులో భాగంగా కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/