నేత్రదానం ప్రకటించిన తమిళనాడు సిఎం

Tamil Nadu CM pledges to donate his eyes during National Eye Donation Fortnight

చెన్నై: తమిళనాడు సిఎం పళనిస్వామి జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్‌ సందర్భంగా తన నేత్రాలను దానం చేశారు. అనంతరం నేత్రదానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోర్టల్‌ను సైతం ప్రారంభించారు. అంధత్వం లేని సమాజం నిర్మాణానికి కళ్లు దానం చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పళనిస్వామికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తమిళనాడు రాష్ట్ర అంధత్వ నియంత్రణ సంఘం, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్‌వీ చంద్రకుమార్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. పళనిస్వామి గర్వించదగిన కంటి దాత అని, తన నేత్రాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తన దేశాన్ని అంధత్వరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆ సర్టిఫికేట్ పేర్కొంది. దేశంలో ప్రతి ఏడాది ఆగస్ట్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నేషనల్‌ ఐ డొనేషన్‌ను ఫోర్ట్‌నైట్‌గా పాటిస్తారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/