అన్నీ అలాంటి ఆఫర్లే

Tamanna
Tamanna

గ్లామర్ పాత్రలకి పెట్టింది పేరుగా వెలిగిపోయింది తమన్నా. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలంటే దర్శక నిర్మాతలకు ఈమె గుర్తిచ్చేది. కానీ కాలానుగుణంగా ఆ పరిస్థితి మారింది. కొత్త హీరోయిన్లు రావడంతో తమన్నా కెరీర్ కొంచెం నెమ్మదించింది. అయినా మళ్ళీ నిలదొక్కుకుంది మిల్కీ బ్యూటీ. ఈసారి నటనకు ఆస్కారమున్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటోంది. ఆ పంథాలో చేసిందే ‘ఎఫ్ 2’. ఈ చిత్రం మంచి సక్సెస్ ఇవ్వడంతో తమనాకు ఆఫర్లు పెరిగాయి.

అయితే ఆ ఆఫర్లతో ఎక్కువగా హర్రర్, థ్రిల్లర్ సినిమాల ఆఫర్లు ఉండటం కొసమెరుపు. ఈ ఏడాది మిల్కీ బ్యూటీ చేసిన సినిమాలు చూస్తే ‘దేవి 2’ హర్రర్ సినిమా. అలాగే హిందీలో చేసిన ‘ఖామోషి’ ఒక సైకో థ్రిల్లర్. ఆమె కొత్తగా సైన్ చేసిన ‘రాజుగారి గది 3’ కూడా పూర్తిస్థాయి హర్రర్ చిత్రమే. అలాగే ‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్లో ప్రధాన పాత్ర చేస్తోంది. అది కూడా ఫుల్ లెంగ్త్ హర్రర్ డ్రామానే. ఇలా ఈ ఏడాది తమన్నా చేసిన, చేస్తున్న చిత్రాల్లో 70 శాతం హర్రర్ థ్రిల్లర్ జానర్లకు చెందినవే. ముందు ముందు ఇలాంటి హర్రర్ చిత్రాల ఆఫర్లు తమన్నాకు ఇంకెన్ని వస్తాయో చూడాలి.