టైమ్స్ స్క్వేర్ బ్యూటీ

Tamanna At Times squareLocation, New York
Tamanna At Times squareLocation, New York

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఎక్కడ ఉందనుకున్నారు? అమెరికాలో. అక్కడ ఏం చేస్తోందంటే దాదాపు పది రోజుల పాటు ‘రంగ్’ అనే పేరుతో మ్యూజికల్ టూర్ లో పాల్గొంటోంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా.. బాలీవుడ్ హాటీ మలైకా అరోరా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో టాలీవుడ్ చందమామ జోరు మామూలుగా లేదు. ట్రిప్పులో గ్యాప్ దొరికితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

Tamanna At Time Square Location, New York
Tamanna At Times square Location,New York


తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు తీసుకున్న లొకేషన్ న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్.   ఇది న్యూయార్క్ లో ఓ పెద్ద ల్యాండ్ మార్క్.  పోల్చడం సరి కాదు కానీ.. అయినా పోలిస్తే మాత్రం అది హైదరాబాద్ కు చార్మినార్ లెక్క.  అందుకే ఎవరు అక్కడికి వెళ్ళినా అక్కడ ఫోటోలు తీసుకుంటారు.  ఈ భామ కూడా అలాంటి పనే చేసింది.  నలుపు పసుపులో గళ్ళ డిజైన్ ఉన్న షార్ట్ గౌన్ ధరించి యమా స్టైలుగా పోజిచ్చింది.  ఫుల్ స్లీవ్స్.. హై హీల్స్.. తో  స్టైల్ ను రంగరించింది.  పోనీ టెయిల్.. మినిమమ్ మేకప్ తో న్యూయార్క్ చందమామలాగా మారిపోయింది.
ఈ ఫోటోకు ఫుల్లుగా లైకులు కొట్టారు.. కామెంట్లు పెట్టారు నెటిజన్లు. “మిలియన్ డాలర్ పోజు”… “ఆసంనెస్ స్పెల్లింగ్”.. “ఫ్యాషనబుల్ బ్యూటీ” అంటూ కామెంట్లు పెట్టారు.