తాలిబన్ వెబ్ సైట్లు ఆఫ్ లైన్

మంచి పరిణామమేనని మీడియా నిపుణుల అభిప్రాయం

Taliban websites offline
Taliban websites offline

తాలిబన్ వెబ్ సైట్లు మూగబోయాయి. తాలిబన్లు ప్రధానంగా ఐదు భాషల్లో వెబ్ సైట్ల ద్వారా తమ భావజాల వ్యాప్తి, ప్రకటనలు చేస్తుంటారు. పష్తో, ఉర్దు, అరబిక్, ఇంగ్లీషు, దరీ భాషల్లో తాలిబన్లు వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్లు శుక్రవారం నుంచి ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయాయి. తాలిబన్ల వెబ్ సైట్ల కార్యకలాపాలు నిలిచిపోవడం మంచి పరిణామమేనని మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/