అమెరికా వెనుకంజ వేస్తే తీవ్రంగా నష్టపోతుంది

taliban
taliban

కాబుల్‌: అమెరికా తమతో శాంతి చర్చలకు వెనుకంజ వేస్తే ఆ దేశం తీవ్రంగా నష్టపోతుందని అఫ్గాన్‌ తాలిబన సంస్థ హెచ్చరించిది. తాలిబన్లతో చర్చలు రద్దు చేయాలని ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం అమెరికాలో ఎంతోమందిని, మరెన్నో ఆస్తులను ధ్వంసం చేసేందుకు దారితీయవచ్చయని పేర్కొంది. ఈ మేరకు తాలిబన్ల ఉగ్రసంస్థ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజా హిద్‌ కాబుల్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరువర్గాల మధ్య ఇప్పటివరకు చర్యలు శాంతియుతంగానే జరిగాయని, అఫ్గాన్‌లో ఈనెల 23న జరగాల్సిన సమావేశం నిర్వహించుకొనేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. అయితే ట్రంప్‌ దీన్ని రద్దు చేసుసుకుంటున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. ఈ నిర్ణయంపై తక్షణం అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నట్లు తాలిబన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/