తాలిబన్లు ఆత్మాహుతి దాడి..ముగ్గురు పోలీస్‌లు మృతి

మరో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి

Taliban suicide blast
Taliban suicide blast

కాబుల్‌: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు తూర్పు ఘంజీ ప్రావిన్సులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఈరోజు ఉదయం ఈ ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో కార్యాలయం పాక్షికంగా దెబ్బతిన్నదని తెలిపారు. గతంలో తాలిబన్లు దొంగిలించిన ఓ సైనిక వాహనం ఉపయోగించుకొని ఈ దాడి జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ దుశ్చర్యకు తామే కారకులమని తాలిబన్‌ సంస్థ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ధ్రువీకరించారు. ఘంజీ ప్రావిన్సులో తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక సగానికిపైగా అఫ్గానిస్థాన్‌లో వీరి కదలికలు ఉన్నాయి. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఇక్కడ ఎక్కువగా దాడులు జరుగుతుంటాయి.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/