అమ్మాయిని అత్యంత దారుణంగా చంపిన తాలిబ‌న్లు

కాబూల్ : ఆప్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్తోన్న నేప‌థ్యంలో తాలిబ‌న్ల ప్ర‌భావం మ‌ళ్లీ పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. ఆఫ్ఘన్‌లో వికృత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ ఇష్టం వ‌చ్చిన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది పౌరుల‌ను బ‌లి తీసుకున్నారు. ఓ మ‌హిళ బిగుతైన దుస్తులు ధ‌రించింద‌ని.. ఆమెను తాలిబ‌న్లు అత్యంత దారుణంగా చంపేశారు. మ‌హిళ‌లు ప‌ని కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని తాలిబ‌న్లు నిషేధం విధించారు. ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ ప‌ని నిమిత్తం బుర్ఖా ధ‌రించి వాహ‌నం ఎక్క‌బోతుండ‌గా తాలిబ‌న్లు దాడి చేసి చంపారు. మృతురాల‌ని 21 ఏండ్ల న‌జానిన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను తాము చంప‌లేద‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. పోలీసులు త‌మ‌పై కావాల‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/