అమెరికా ఆయుధాలతో పరేడ్ నిర్వహించిన తాలిబన్లు

తాలిబన్ల చేతికి చిక్కిన అత్యాధునిక ఆయుధాలు
తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది సైనికులు
పైలట్లు, మెకానిక్ లను చేర్చుకుంటున్న తాలిబన్లు

కాబుల్ : ఆఫ్ఘనిస్థాన్ ను కైవసం చేసుకున్న తాలిబన్లకు పెద్ద ఎత్తున అమెరికా, ఇతర దేశాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలు లభించిన సంగతి తెలిసిందే. అత్యంత అధునాతనమైన ఆయుధాలను వారు సొంతం చేసుకున్నారు. తాలిబన్ల పాలన మొదలైన తర్వాత కొత్తగా 250 మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు. వీరు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా కవాతు నిర్వహించారు.

ఈ కవాతులో ఎం117 సాయుధ వాహనాలు, ఎం17 హెలికాప్టర్లు, ఎం4 అస్సాల్ట్ తుపాకుల వంటి వాటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తాలిబన్ల ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ గతంలో జాతీయ దళాల్లో పని చేసిన పైలట్లు, మెకానిక్ లను ఇప్పుడు తమ సైన్యంలో చేర్చుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు గతంలో కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించిన తాలిబన్ ఫైటర్లు… ఇప్పుడు మిలిటరీ దుస్తులను ధరిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/