ఆఫ్ఘ‌నిస్తాన్‌లో విదేశీ క‌రెన్సీపై నిషేధం: తాలిబ‌న్లు

కాబూల్‌ : ఆఫ్ఘ‌నిస్తాన్‌లో విదేశీ క‌రెన్సీపై తాలిబ‌న్లు నిషేధం విధించారు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత జ‌ఠిలంగా త‌యారుకానున్న‌ది. ఆగ‌స్టులో దేశాన్ని తాలిబ‌న్లు ఆధీనంలోకి తీసుకున్న త‌ర్వాత‌.. ఆఫ్ఘ‌న్ జాతీయ క‌రెన్సీ విలువ దారుణంగా ప‌త‌న‌మైంది. విదేశీమార‌క నిలువ‌లు కూడా అడుగంటిపోయాయి. దేశంలో ఉన్న బ్యాంకుల్లో న‌గ‌దు కూడా క్ర‌మంగా త‌గ్గుతోంది.

మ‌రో వైపు ప్ర‌పంచ దేశాలు ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌డం లేదు. దీంతో ఆ దేశానికి క‌ష్టాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో చాలా వ‌ర‌కు అమెరికా డాల‌ర్ల రూపంలో వాణిజ్యం న‌డుస్తుంది. ఇక పాకిస్థాన్ బోర్డ‌ర్ దారిలో పాక్ క‌రెన్సీని కూడా వినియోగిస్తారు. స్వ‌దేశీ వ్యాపారం కోసం విదేశీ క‌రెన్సీ వాడే వారిని శిక్షిస్తామ‌ని తాలిబ‌న్ల ప్ర‌తినిధి జ‌బియుల్లా ముజాహిద్ తెలిపారు. దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి లావాదేవి కోసం ఆఫ్ఘ‌నీ క‌రెన్సీ వాడాల‌ని ముజాహిద్ ఆదేశించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/