మహిళాలు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను నిలిపివేయాలి :తాలిబాన్

కాబుల్: ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌పై ఎన్నో ఆంక్ష‌లు విధించిన తాలిబ‌న్లు..ఇప్పుడు మ‌రో ఆంక్ష‌ని విధించిన వైనం విస్తుపోయేలా చేస్తోంది..ఆఫ్గ‌నిస్థాన్ ని చేజిక్కించుకుని వారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబ‌న్ల ఆగ‌డాల‌కు హ‌ద్దే లేకుండా పోతోంది. ఆడ‌వారితో పాటు మ‌గ‌వారికి ప‌లు హుక్కుంలు జారీ చేస్తూ నిత్య న‌ర‌కాన్ని వారికి చూపిస్తున్నారు. దాంతో ఆఫ్గ‌న్ వాసులు దీన‌స్థితిలో బ‌తుకును వెల్ల‌దీస్తున్నారు. వారి ప్ర‌భుత్వాన్ని నెల‌కొలిపిన త‌ర్వాత ఎన్నో ఆంక్ష‌లు విధించిన వారు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలపై నిబంధనలు కొనసాగిస్తున్నారు. తాజాగా టీవీ షోలపైనా ఆంక్షలు విధించింది తాలిబ‌న్ ప్ర‌భుత్వం.

మహిళా నటులు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ నుంచి అక్కడి మీడియాకు వచ్చిన తొలి అధికారిక ఉత్తర్వులు ఇవి. ఫిమేల్ యాక్ట‌ర్స్ ఉండే కార్యక్రమాలతోపాటు, మహమ్మద్ ప్రవక్త, ఇతర మత ప్రముఖులను చూపించే సినిమాలు, ప్రోగ్రాంలను ఛానళ్లు ప్రసారం చేయరాదని ఆ దేశ ప్రమోషన్ ఫర్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, వుమెన్ జ‌ర్న‌లిస్ట్ లు రిపోర్టింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని స్పష్టం చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/