భార‌త్‌ను విశేషంగా కొనియాడిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్

‘Talented, driven people’: Putin praises India and its potential for development

మాస్కోః ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భార‌తీయుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయులు ప్ర‌తిభావంతులు అని అన్నారు. అభివృద్ధి అంశంలో భార‌త్ ఎన‌లేని ప్ర‌గ‌తిని సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. శుక్ర‌వారం యూనిటీ డే సంద‌ర్భంగా ర‌ష్య‌న్ భాష‌లో పుతిన్ మాట్లాడారు. ఆ ప్ర‌సంగంలో భార‌త్‌ను విశేషంగా పుతిన్ కొనియాడారు.

అభివృద్ధి విష‌యంలో భార‌త్ అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తుంద‌ని, ఆ దేశంలో 150 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని, అదే వాళ్ల సామ‌ర్థ్యం అని పుతిన్ పేర్కొన్నారు. ఇండియాను ఓసారి గ‌మ‌నించండి అని, అభివృద్ధి కోసం ప్ర‌జ‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌న్నారు. ఆఫ్రికాలో సాగిన బ్రిటీష్ పాల‌న గురించి కూడా పుతిన్ మాట్లాడారు. భార‌త్ సామ‌ర్థ్యం, ర‌ష్యా నాగ‌రిక‌త‌, సంస్కృతి చాలా భిన్న‌మైన‌వ‌న్నారు. ప‌శ్చిమ దేశాలు ఆఫ్రికాను దోచుకున్నాయ‌న్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/