మోడీకి స్వాగతం పలికిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, మంత్రి త‌ల‌సాని

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల కోసం వ‌చ్చిన మోడీ

talasani-srinivas-yadav-welcomes-prime-minister-narendra-modi-at-begumpet-airport

హైదరాబాద్‌ః బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్‌తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి కూడా ఆయ‌న‌కు స్వాగ‌తం చెప్పాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో క‌లిసి తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌ధాని మోడీ కి స్వాగ‌తం ప‌లికారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్ట‌ర్‌లో మోడీ బ‌య‌లుదేరే దాకా త‌ల‌సాని అక్క‌డే ఉండిపోయారు.

మోడీ కి స్వాగ‌తం ప‌లికే సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌, ప‌లువురు బీజేపీ నేత‌లు వ‌రుస‌గా నిలుచుండ‌గా… టీఆర్ఎస్‌కు చెందిన త‌ల‌సాని ఒక్క‌రు మాత్ర‌మే వేరేగా క‌నిపించారు. ఎందుకంటే… అప్ప‌టికే మోడీ కంటే ముందుగానే య‌శ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకోగా…సీఎం కేసీఆర్ స‌హా కేటీఆర్ ఇత‌ర మంత్రులు, పార్టీ నేత‌లంతా క‌లిసి సిన్హాతో పాటే జ‌ల విహార్‌కు వెళ్లిపోయారు. అయితే న‌గ‌రానికి చెందిన మంత్రి కావ‌డంతో త‌న పార్టీ నేత‌లంతా జ‌ల విహార్‌కు వెళ్లిపోయినా త‌ల‌సాని ఒక్క‌రు మాత్రం మోడీ కి ఆహ్వానం ప‌లికేందుకు బేగంపేట‌లోనే ఉండిపోయారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/