విపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి

వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు బిజెపి కి రాలేదు

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ప్రజల్లో పరపతిని సాధించి సత్తా చాటేందుకు విపక్షాలు ప్రయత్నం చేయాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చురకంటించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పెట్రేగిపోయిన విపక్ష నాయకులకు ఈ ఫలితాలు చెంపపెట్టన్నారు. మేమే ప్రత్యామ్నాయమంటూ భీషణ ప్రతిజ్ఞలతో రెచ్చిపోయిన బిజెపి కి కనీసం ఓ వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు రాని విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల ముందు విపక్షాలు ప్రజల్లో పార్టీని బలపర్చుకుని అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/