టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: నాంపల్లి నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ ఛార్జ్‌ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో విజయ్‌నగర్‌ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నాంపల్లిలో తెరాస సభ్యత్వం జోరుగా కొనసాగుతుందని. ఆయన అన్నారు. సిఎం కెసిఆర్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని వివరించారు. హైదరాబాద్ మహనగరానికి నీటికొరత లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందుచూపుతో కాళేశ్వరం నుంచి నీటిని తరలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్‌వీఎస్‌ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/