ప్రజలు గర్వపడేలా ఆ భవనాలను నిర్మిస్తాం

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ఈరోజు సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వంపై చేసిన పలు విమర్శలు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతు అరునూరైనా కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించి తీరుతామని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రజలు గర్వపడేలా ఆ భవనాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయితే పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. పిక్నిక్‌ కోసం వచ్చినట్లు సచివాలయానికి వచ్చివెళ్లారని ఎద్దేవాచేశారు. నాలుగు గంటల పాటు అన్ని భవనాలను పరిశీలించవచ్చు కదా? అని అన్నారు. నూతన భవనాల నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/