తలాక్‌ను వ్యతిరేకించడమే కారణం: సామాజిక బహిష్కరణ

Talak
Talak

ఉత్తరప్రదేశ్‌:  బరేలీకి చెం దిన ఓ మ#హళపై స్థానిక మతగురువు కఠినశిక్ష విధిస్తూ ఫత్వా జారీ చేశారు. త్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకించడమే ఇందుకు కారణం. తలాక్‌పై పోరాటం చేస్తూ తనలాంటి బాధితులకు సహా యంగా నిలిచేందుకు నిదా ఖాన్‌ ఓ స్వ చ్ఛంద సంస్థను (ఎన్జిdఓ) నడుపు తున్నారు. ఆమె నిర్వాహంతో మత గురువు ఆగ్రహించారు. ఆమెపై సామాజిక బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని, చివరకు జబ్బు చేసినా మందులు ఇవ్వొద్దని, ఒకవేళ చనిపో యినా ఎవరూ అంత్యక్రియలకు వెళ్లొ ద్దని, మృతదేహాన్ని పూడ్చిపెట్టేందు కు శ్మశానంలోకి ప్రవేశం ఇవ్వొ ద్దంటూ అమానుష ఆదేశాలతో ఫ త్వా జారీచేశారు. ఫత్వాను బేఖాతరు చేస్తూ, ఎవరైనా ఆమెకు సహాయం చేస్తే.. వాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని మతగురువు హెచ్చరించారు. ముస్లిం వ్యతిరేక విధానాలకు మద్దతిస్తున్నందుకు ఆమె బ#హరంగంగా అందరికీ క్షమా పణలు చెప్పే వరకూ ముస్లింలెవరూ ఆమెతో మాట్లాడడానికి వీల్లేదని మతగురువు షహార్‌ ముఫ్తి ఖుర్షిద్‌ ఆలం వెల్లడించారు