ధైర్యంలేని సెలక్టర్లను తొలగించండి

గంగూలీకి సూచించిన హర్భజన్‌

harbhajan singh and sourav ganguly
harbhajan singh and sourav ganguly

ఢిల్లీ: యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ను బంగ్లాదేశ్‌ తో జరిగే టీ20 సిరీస్‌కోసం టీమిండియాకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే శాంసన్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాలేదు, అంతేకాకుండా వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల జట్టులో అతడు స్థానం కోల్పోయారు. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఏ ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండానే అతన్ని ఎలా అంచనా వేసి, ఏ ప్రాతిపదికన శాంసన్‌ను జట్టు నుంచి తొలగిస్తారని మండిపడ్డారు. ఏ మాత్రం ధైర్యంలేని ఇలాంటి సెలక్టర్లను తక్షణమే తొలగించాలని హర్భజన్‌ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి సూచించారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ కూడా ఇదే విధంగా స్పందించారు. అసలు అతడిని జట్టులోకి తీసుకున్నది బ్యాటింగ్‌ను పరీక్షించడానికా? లేక అతడి సహనాన్ని పరీక్షించడానికా? అని ప్రశ్నించారు. మూడు టీ20 మ్యాచ్‌లకు అతడిని మంచినీళ్లు అందించే బాయ్ లాగా వాడుకుని, ఇప్పుడు తొలగించడం సమంజసం కాదని శశి థరూర్ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/