‘నా ఆస్తులతో జెట్‌ను కాపాడండి’

vijay malya
vijay malya

అప్పుల ఊబిలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌పై మాల్యా ట్వీట్లు


న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ముందుకు వచ్చిన ఎస్‌బిఐ కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను కూడా అలాగే కాపాడండి అని విజ§్‌ు మాల్యా ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరారు. అప్పుల ఊబిలో ఉన్న జెట్‌ను కాపాడేందుకు ఎస్‌బిఐ దేశీయ రుణదాతల పరిష్కార ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే జెట్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య బోర్డు నుంచి వైదొలిగారు. ఈ పరిణమాలపై విజ§్‌ు మాల్యా హర్షం వ్యక్తం చేశారు. ఐతే తన విమానయాన సంస్థకు కూడా ఇలానే సాయపడి ఉంటే బాగుండేదని విమర్శలు చేశారు. తన ఆస్తులను తీసుకుని జెట్‌కు సాయం చేయండంటూ వరుస ట్వీట్లు చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆదుకుని ఎందరో ఉద్యోగాలను, సంస్థను కాపాడటం ఆనందంగా ఉంది. ఐతే కింగ్‌ఫిషర్‌ను కూడా ఇలాగే ఆదుకుని ఉంటే బాగుండేది అని కింగ్‌ ఫిషర్‌ను కాపాడండి అంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌కు తాను రాసిన లేఖలపై బిజెపి ప్రతినిధులు ఎన్నో ఆరోపణలు చేశారు. యూపిఏ హయాంలో తన సంస్థకు తప్పుగా మద్దతిస్తున్నాయని ఆరొపించారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏం మారిందో..నాకెంతో ఆశ్చర్యంగా ఉంది అని మాల్యా విమర్శలు చేశారు.

తాజా బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/