వాలంటరీ డిస్‌క్లోజర్‌స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోండి

talasani srinivas yadav
talasani srinivas yadav

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్‌లను క్రమబద్దీకరించడానికి వాలంటరీ డిస్‌క్లోజర్‌స్కీమ్‌ (వీడీఎస్‌)ను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతూ 1628 చ. కి.మీ. వైశాల్యంతో ఔటర్‌ రింగ్‌రోడ్‌వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్‌ నగరానికి మంచినీటిని మెట్రోవాటర్‌బోర్డు 200కి.మీ. దూరంలో ఉన్న గోదావరి, కృష్ణానదుల నుంచి తీసుకువస్తోందన్నారు. ప్రతి 1000 లీటర్లకు 47రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 472 మిలియన్‌గ్యాలన్ల నీటిని అంటే దాదాపు 214 కోట్ల 76లక్షల లీటర్ల నీటిని రోజూ సరఫరా చేస్తోందన్నారు. ఎన్నోవ్యయ ప్రయాసాలకోర్చి తరలించిన నీటిని ప్రతి 1000లీటర్లకు కేవలం 7 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. అక్రమ కనెక్షన్‌ల వల్ల బోర్డు ఆదాయానికి గండిపడుతోందన్నారు. అక్రమ నీటి కనెక్షన్స్‌ విషయం పై ఇటీవల ప్రభుత్వానికి విన్నవించినప్పుడు వాలంటరీ డిస్‌క్లోజర్‌స్కీమ్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. అక్రమ కనెక్షన్‌లు కలిగి ఉన్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఫిబ్రవరి 21, 2020 వరకు వీడిఎస్‌ స్కీమ్‌లో క్రమబద్దీకరించుకోవాలని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/