భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్

Pawan kalyan

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ కు కూడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ ను పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవ్వాలనే ఉద్దేశ్యంతో ఔట్ డోర్ షూటింగ్స్ కంటే ఎక్కువగా భారీ సెట్టింగ్స్ వేసి ఇండోర్ లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్ ను వేయబోతున్నారట. అలాగే చార్మినార్ సెట్టింగ్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్ ను నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే సినిమా లో కీలకమైన ఇతర సీన్స్ తీసేందుకు వీధి సెట్లు మరియు కోర్టు సెట్ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/