చైనా, తైవాన్ అధికారుల మధ్య ఫిజీలో ఘర్షణ

తీవ్రంగా గాయపడిన తైవాన్ దౌత్యాధికారి

china-embassy-official-attacks-on-taiwanese-official-in-suva

సువా‌: తైవాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఫిజీ రాజధాని సువాలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిజీలో ఉన్న అనేక దేశాల దౌత్య సిబ్బందితో పాటు చైనా దౌత్యాధికారులను కూడా తైవాన్ ఎంబసీ అధికారులు ఆహ్వానించారు. అయితే ఓ చైనా దౌత్యాధికారి ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులను ఫొటోలు తీస్తుండడం పట్ల తైవాన్ అధికారి అభ్యంతరం చెప్పారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అధికారి కోపోద్రిక్తుడై తైవాన్ అధికారిపై దాడికి దిగాడు. ఈ ఘర్షణలో తైవాన్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటనపై తైవాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఫిజీలో చైనా దౌత్యాధికారులు తమ పరిధి మీరి దురుసుగా ప్రవర్తించారని వ్యాఖ్యానించింది. దీనిపై ఫిజీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/