అమెరికాతో తైవాన్‌ ఒప్పందం

Taiwan signs deal with US to buy F-16 jets

వాషింగ్టన్‌: అమెరికా అధునాతన ఎఫ్ 16 ఫైటర్‌ జెట్లను తైవాన్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫైటర్‌ జెట్లను అమెరికాకు చెందిన రక్షణ, ఏరోస్పేస్, టెక్నాలజీ సంస్థ లాఖీడ్ మార్టిన్ కార్ప్ తయారు చేసింది. 1992 నుంచే తైవాన్‌కు అధునాతన యుద్ధ విమానాలను విక్రయించాలని అమెరికా భావిస్తున్నా చైనా నుంచి వ్యకిరేకత వ్యక్తమవుతోంది. తమ సొంత భూభాగంగా భావించే ద్వీపానికి ఆయుధాలను విక్రయించవద్దని పదేపదే అమెరికాను హెచ్చరిస్తూ వస్తోంది. గతేడాది చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తైవాన్‌కు యుద్ధ విమానాలను విక్రయించవద్దని, తైవాన్‌తో ఆయుధ అమ్మకాలు, సైనిక ఒప్పందాన్ని సైతం నిలిపివేయాలని వాషింగ్టన్‌ను కోరింది. మాట వినకపోతే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/