మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సీ

Taapsee Pannu & Mithali Raj
Taapsee Pannu & Mithali Raj

ముంబయి: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌పై వస్తున్న వార్తలు గురించి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సీపొన్ను మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో టైటిల్‌ పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని మిథాలీ రాజ్‌ పుట్టినరోజు సందర్భంగా తాప్సీ అధికారికంగా వెల్లడించింది. శభాష్‌ మిథు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్‌ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిథాలీ పుట్టిన రోజు సందర్భంగా .. పుట్టిన రోజు శుభాకాంక్షలు కెప్టెన్‌ మిథాలీ అంటూ తాప్సీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తెరపై నిన్ను చూసుకున్నప్పుడు గర్వపడేలా చేస్తానని, అదే తాను ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్‌ అంటూ తాప్సీపొన్ను ట్వీట్‌ చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/