దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌
Virat Kohli

Dharmasala: భారత జట్టు శనివారం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌తో ఆరంభిం చనున్నది. అనుభవజ్ఞులు, మెరికల్లాంటి యువకులతోకూడిన కోహ్లీ సేన టి20 ప్రపంచకప్‌ను అందుకోవాలని తహతహలాడుతోంది. ప్రపం చకప్‌ తరువాత వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 3-0తో గెలుచుకుని ఆత్మవిశ్వాసం తో ఉన్న భారత జట్టు ప్రొటీస్‌పైకూడా క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆశిస్తోంది. క్విం టన్‌ డికాక్‌ నేతృత్వం లోని దక్షిణాఫ్రికాతో స్వదేశం లో జరిగే ఈ సిరీస్‌లో విజయం అంత సులువుగా లభించదని పరి శీల కుల భావన. టి20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ముందంజలోవున్న దక్షిణా ఫ్రికాను ఓడించాలంటే భారత్‌ శ్రమించా ల్సిందే. రబడ తీక్షణమైన బంతులను, డేవిడ్‌ మిల్లర్‌ ధాటైన బ్యాటింగ్‌ను నిలువరించడం భారత్‌కు కఠిన పరీక్షే. డుప్లెసిస్‌, హషీం ఆవ్లూల లోటును పూరించే బాధ్యత టెస్టు స్పెషలిస్టులు టెంబా బవుమ, అన్రిచ్‌ నోట్జె చేపట్టనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌నాటికి జట్టు బలహీనతలను అధిగమించి మెరుగైన జట్టును రూపొందించుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిలపై ఉంది