ముందు టీ20లు..టెస్టుల గురించి తర్వాత

Players
Players

ఢాకా: పూర్తి పర్యటన కోసం రావాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చేసిన అభ్యర్థనను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తిరస్కరించింది. ముందుగా టీ20లు ఆడతామని, టెస్టుల గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీబీ తెలిపింది. మొదటగా టీ20 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే టెస్టుల సంగతి చూద్దామని తేల్చి చెప్పింది. తమ దేశంలో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడాలని బంగ్లాదేశ్‌ను పాక్ బోర్డు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మా జట్టు యాజమాన్యంలో చాలా మంది విదేశీయులు ఉన్నారు. జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకుంటాం. ఇక్కడ అందరి అభిప్రాయాలను పరిశీలించాల్సిందే. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టీ20లు ఆడతాం. ఆ తర్వాత టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిజాముద్దీన్‌ చౌదురి తెలిపాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/