కడపలో భారీ స్టీల్‌ ప్లాంట్‌.. స్విస్‌ కంపెనీ అంగీకారం

Swiss giant imr ag meets cm jagan
Swiss giant imr ag meets cm jagan

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.
కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ఎదుట కడప జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్‌ కంపెనీ కార్యకలాపాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/