ఈతకు వెళ్లి ఫొటోగ్రాఫర్ గల్లంతు
సంగంజాగర్లమూడి లాకుల వద్ద దుర్ఘటన

Tenali: సరదాగా ఈతకు దిగిన యువకుడు గల్లంతు అయిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి తెనాలి మండలం సంగం జాగర్లమూడి కాలవ లో ఈతకు వెళ్లి ఫొటోగ్రాఫర్ పవన్ కుమార్ గల్లంతు అయ్యారు.
పట్టణ రామలింగేశ్వరరావు పేట డిపో రోడ్డుకు చెందిన ఫొటోగ్రాఫర్ పవన్ కుమార్ శనివారం రాత్రి మిత్రులతో కలిసి జాగర్లమూడి లాకుల వద్ద ఈతకు దిగారు.
పవన్ కుమార్ నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. పవన్ కుమార్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
సమాచారం అందుకున్న తెనాలి తాలూకా ఎస్ఐ మన్నెం మురళి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/