స్టట్ గార్ట్ ఓపెన్ నుంచి తప్పుకున్న స్వైటెక్

మాడ్రిడ్ ,రోమ్ టోర్నీ లపై దృష్టి

Swiatek
Swiatek

స్టట్ గార్ట్ (జర్మనీ): ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఛాంపియన్ స్వైటెక్ వచ్చే వారం స్టట్ గార్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి తప్పుకుంది. తన కోర్ట్ పోరును మాడ్రిక్ టోర్నీ నుంచి ఆరంబించనున్నట్టు తెలిపింది . ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నిలబెట్టుకునేందుకు ఎంపిక చేసిన టోర్నీ లలోనే తలపడనున్నట్టు , స్టట్ గార్ట్ టోర్నీ నుంచి తప్పుకుని మాడ్రిడ్ ,రోమ్ టోర్నీ లపై దృష్టి సారించినట్టు 19 ఏళ్ళ స్వైటెక్ వెల్లడించింది. చివరిసారిగా గత నెలలో మయామి ఓపెన్ లో తలపడిన స్వైటెక్ మూడవ రౌండ్ లోనే నిష్క్రమించింది. అందుకే ఆచి తూచి టోర్నీ లను ఎంపిక చేసుసుకుంటున్నట్టు తెలిపింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/