తీపి గుమ్మడి హల్వా

రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

Sweet pumpkin halwa
Sweet pumpkin halwa

భారత దేశంలో ఒక్కో పండుగకి ఒకో రాష్ట్రం లో ఒక ప్రత్యేక వంటకం చేస్తారు. బెంగాలీలు మకర సంక్రాం తికి బొబ్బట్ల వంటి పీటా తయారు చేస్తారు.

కర్ణాటక వాళ్లు పాల్యాలని తయారు చేస్తారు. ఈ వంటకాన్ని కర్నాటక వాసులు సంక్రాంతి రోజున బంగాళదుంప లేదా తీపి గుమ్మడితో చేస్తారు.

కావలసిన పదార్థాలు ..

తీప్పి గుమ్మడి సన్నగా తరిగినది ఒకటిన్నర కప్పు ఎండు మిర్చి రెండు, పచ్చిమిర్చి రెండు. తాజాగా తురిమిన కొబ్బరి ఒకటిన్నర కప్పు. కొత్తిమీర సన్నగా తరిగినది రెండుమూడు కట్టలు. నూనె మూడు స్పూన్లు. ఉప్పు రుచికి తగినంత, పోపుకు ఆవాలు రెండు

టీ స్పూన్లు, మినప్పప్పు రెండు టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, శనగపప్పు రెండు టీ స్పూన్లు, కరివేపాకు నాలుగైదు రెబ్బలు. పసుపు ఒకటింపావు స్పూను.

తయారుచేయు విధానం

తీపి గుమ్మడి చెక్కు తీసి, దానిలో గింజలు తీసేసి సన్నటి ముక్కలుగా తరగాలి. ఒక మూడుకు తీసుకుని దానిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, ఇంగువ, పసుపు వేసి పచ్చిమిర్చి, ఎండు మిర్చి వేసి ఒక ముప్పై సెకన్లు వేగనివ్వాలి.

పోపులో పప్పులు రంగు మారుతుండగా తరిగిన గుమ్మడి ముక్కలు వేసి కాసిని నీళ్లు చేర్చి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.

ఒక అయిదు నిమిషాల తరువాత మూత తీసి గుమ్మడి ఉడికిందేమో చూసి ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో కొత్తిమీర తరుగు, తాజా కొబ్బరి వేసి అన్నీ కలిసేటట్టు కలపాలి.

అంతే తీపి గుమ్మడి పాల్యా తయారయిపోయింది. దీనిని వేడి వేడిగా అన్నంతో కానీ చపాతీలతో కాని కలిపి వడ్డించండి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/