స్వీట్‌ కార్న్‌ కేక్‌

రుచి: వెరైటీ వంటకాలు

Sweet corn cake
Sweet corn cake

కావల్సినవి :

స్వీట్‌కార్న్‌ గింజలు- రెండున్నర కప్పులు, చిక్కటిపాలు- కప్పు కొబ్బరిపాలు-కప్పు, మొక్కజొన్న రవ్వ- రెండు కప్పులు, పంచదార-కప్పున్నర, నూనె-ముప్పావుకప్పు,
గుడ్లు-నాలుగు, కొబ్బరికోరు- కప్పు, ఉప్పు- తగినంత, బేకింగ్‌సోడా- అరచెంచా

తయారీ :

ముందుగా అవెన్‌ని 350 డిగ్రీల పారిన్‌హీట్‌ దగ్గరవేడిచేసి ఉంచుకోవాలి. బేక్‌ చేయాలనుకుంటున్న పాన్‌కి బటర్‌ రాసి సిద్ధం చేసి పెట్టుకోవలి.

మిక్సీజార్‌లో మొక్కజొన్న గింజలు, పాలు వేసి మెత్తగా పేస్ట్‌లా అయ్యేలా మిక్సీ పట్టాలి.

Sweet corn cake
Sweet corn cake

ఇందులోనే కొబ్బరిపాలు, మొక్కజొన్న రవ్వ, పంచదార, నూనె, గుడ్లు, ఉప్పు వేసి అన్నీ దానితో ఒకటి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి.

చివరిగా బేకింగ్‌సోడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని బేకింగ్‌పాన్‌లో వేసి 50 నిమిషాలపాటు బేక్‌ చేసుకోవాలి. చివరిగా టూత్‌పిక్‌ గుచ్చి చూస్తే పిండి టూత్‌పిక్‌కి అంటుకోకుండా ఉండాలి.

అవెన్‌ నుంచి తీసి.. అంచుల నుంచి కేక్‌ని తవేరుచేసి చల్లార్చుకోవాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/