నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు : ప్రధాని మాగ్డలీనా అండరన్స్‌

స్టాక్‌హోం : నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు స్వీడన్‌ ప్రధానమంత్రి మాగ్డలీనా అండరన్స్‌ ప్రకటించారు. ఇప్పటికే ఫిన్లాండ్‌లో నాటోలో చేరుతామని తప్పిదం’గా రష్యా అభివర్ణించింది.

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. నాటోలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా సైనిక చర్యలను ప్రారంభించింది. మరో వైపు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా పలు దేశాలు నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. రష్యా బలగాలు తమ దృష్టిని డోనెట్స్క్‌ ప్రాంతంపై కేంద్రీకరిస్తున్నాయని, పట్టణాల్లోని పౌర, సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉక్రెయిన్‌ మిలటరీ పేర్కొంది. మరో వైపు ఉక్రెయిన్‌లో మాస్కో మోహరించిన బలగాల్లో మూడింట ఒక వంతు బలగాలను కోల్పోయి ఉండవచ్చని, డాన్‌బాస్‌ ప్రాంతంలో దాడి వేగాన్ని కోల్పోయిందని, షెడ్యూల్‌ కంటే గణనీయంగా వెనుకపడిపోయిందని బ్రిటిష్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ ఆదివారం తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/