చెమట కాయలకు చెక్ పెట్టండి

వేసవి కాలంలో ఆరోగ్య చిట్కాలు

To Avoid sweating

సాధారణంగా శరీరం నుంచి స్వేద గ్రంథుల ద్వారా చెమట బయటకు వస్తుంది. కానీ ఎక్కడైనా ఈ గ్రంధులు మూసుకుపోతే చెమట బయటకు రాలేక శరీరంపై ఎర్రగా ఉండే చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. ఇంటర్లో ఉండే పధార్ధాలతో చెమట కాయల్ని వదిలుంచుకోవచ్చు.. వేడి ఎక్కువగా ఉన్నపుడు దాహం తీర్చుకోవటానికి ఎలాగైతే చల్లటి పానీయాలు తాగుతామో . అలాగే చెమట కాయలు ఏర్పడినపుడు కూడా చల్లటి ఐస్ ముక్కలు శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి..ఇంట్లో ఉండే పధార్ధాలతో చెమట కాయల్ని వదిలించు కోవచ్చు.. చిన్న చిన్న ఐస్ ముక్కలను ఎర్రగా ఉన్న చెమట కాయలపై రుద్దాలి ఇలా చేయటం వలన మంట తగ్గిపోయి తద్వారా చెమట కాయలూ తగ్గుతాయి.

వేపాకుతో

కొన్ని వేపాకులను తీసుకుని నీళ్లు పోస్తూ, మెత్తటి పేస్ట్ లా నూరుకోవాలి.. ఈ పేస్ట్ ని చెమటకాయలున్న చోట పూసి.. పూర్తిగా ఆరనివ్వాలి. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల వలన శరీరం పై ఉండే క్రిములు నాశనమై తక్షణ ఉపశమనం లభించటంతో పాటు ఏవైనా ఇతర చర్మ వ్యాధులుంటే కూడా తొలగిపోతాయి..

చందనంతో చల్లదనం

చందనం పొడి, కొత్తిమీర పొడి, ఈ చెమటకాయలున్న చోట పూయాలి.. ఆరిపోయిన తర్వాత చల్లటి నీతితో శుభ్రంగా కడిగేయాలి.

నిమ్మ రసంతో ..

నిమ్మ రసం ఎక్కువగా తాగటం వలన చెమటకాయలు తగ్గిపోవటమే కాదు.. శరీరానికి కూడా చలువ చేస్తుంది.. రోజుకు నాలుగు గ్లాసుల నిమ్మరసం తాగితె ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు..

కలబంద గుజ్జుతో..

కలబంద గుజ్జును చెమటకాయలుండే చోట పెట్టి కాసేపు అలా ఉంచాలి.. తర్వాత చల్లటి నీతితో స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

చెమట కాయలు రాకుండా ఉండాలంటే..

వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో నీళ్లు బాగా తాగాలి.. శరీరానికి పెట్టినట్టుగా ఉండే దుస్తులు కాకుండా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.. చర్మాన్ని ఎపుడూ తాజాగా ఉంచుకోవాలి.. అలాగే స్నానానికి ర రసాయనాలు ఎక్కువగా ఉండే సబ్బులు ఉపగోగించ కూడదు.. కొంతమంది చర్మం పొడిబారిపోతుంది కదా.. అని రకరకాల క్రీమ్స్, ఆయిల్స్ ఉపయోగిస్తారు.. కానీ, అవి చెమట కాయల్ని అరికట్టవు .. పైగా చర్మంపై ఉండే స్వేద గ్రంథులను మూసేసి చెమట బయటకు రాకుండా చేస్తాయి.. ఇది చర్మానికి అంత మంచిది కాదు. పడుకునే గదిలో చల్లగా, బాగా గాలి ఆడేలా వెంటిలేషన్ ఉంచుకోవాలి… వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్నపుడు చల్లగా ఉండే లేదా గాలి ఎక్కువగా ప్రసరించే ప్రదేశంలో ఉండటం మంచిది.

‘నాడి’ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/