స్వాతిముత్యం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

బెల్లం కొండ గణేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గణేష్ హీరోగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వాతి ముత్యం అనే సినిమాను నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో.. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా మేకర్స్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను సోమవారం విడుదల చేసారు.

నీ చారెడు కళ్లే.. అంటూ సాగే ఈ లిరికల్ వీడియో శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది. మహతి స్వరసాగర్ స్వరాలు అందించగా కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ సంజనా కల్మాంజే ఆలపించిన పూర్తి సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమబ్మల మధ్య కుదిరిన కెమిస్ట్రీ అదిరింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ప్రధాన హైలైట్ గా నిలవబోతోంది. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీని ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ లో రావు రమేష్ , సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్థన్ , పమ్మిసాయి , గోపరాజు, రమణ శివనారాయణ , సురేఖా వాణి, సునైనా , దివ్యశ్రీపాద తదితరులు నటిస్తున్నారు.

YouTube video