రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి

భవిష్యవాణి వినిపించిన జోగిణి స్వర్ణలత

Swarnalatha-Bhavishyavani

సికింద్రాబాద్‌: సికింద్రబాద్‌లో ఆషాడమాసం బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ ఏ భవిష్యవాణి కార్యక్రమం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే జోగిణి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్నదానికి వాళ్లు అనుభవించక తప్పదు కదా అని అమ్మ అన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అమ్మవారు అన్నారు. ప్రజలందిరినీ తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని.. తీవ్రస్వరంలో చెప్పారు. అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు. ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా, భక్తిభావనతో చేసినట్టైతే… తప్పక కాపాడతానన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/