నిత్యానందకు స్పిన్నర్ అశ్విన్ సెటైర్

హైదరాబాద్: తాను దేవుడని చెప్పుకు తిరుగుతున్న వివాదాస్పద గురువు నిత్యానంద ఇటీవలే ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాసం అనే పేరు పెట్టారు. అంతేకాకుండా దీన్ని రాజకీయేతర దేశంగా గుర్తించాలని పేర్కొన్నారు. దానికి ప్రత్యేక రాజ్యాంగం, జెండా, చిహ్నాన్ని కూడా రూపొందించినట్లు కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశానికి ప్రధాని, రాష్ట్రపతితో పాటు పాస్పోర్టు సదుపాయం కూడా ఉంటుందని అన్నారు. ఈ దేశానికి విరాళాలు ఇవ్వాలని దాని ద్వారా కైలాస అనే గొప్ప హిందూ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ దేశాన్ని హిందూ సార్వభౌమ దేశంగా ప్రకటిస్తున్నాని అందులో పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో కౌంటరిచ్చారు. అక్కడికి రావాలంటే వీసా ఎలా పొందాలి? లేదా వీసా ఆన్ అరైవల్ ఏమైనా ఇస్తారా? అంటూ అశ్విన్ ట్వీట్ చేశారు. అంతే ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/