స్వచ్చ సౌచాలయ్‌లో పెద్దపల్లి టాప్‌

నేడు ఢిల్లీలో పురస్కార ప్రధానం

peddapalli district
peddapalli district

పెద్దపల్లి: నేడు ఢిల్లీలో స్వచ్ఛ సుందర్‌ సౌచాలయ్‌ పథకంలో భాగంగా దేశంలోని ఉత్తమ జిల్లాలకు పురస్కారాల కార్యక్రమం జరగనుంది. ఐతే 2017-18 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌లో తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లా దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పట్లో కేంద్రమంత్రి ఉమాభారతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ దేవసేన, స్వచ్ఛతలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ పథకంలో భాగంగా సౌచాలయాలను శుభ్రంగా ఉంచడం, సుందరంగా తీర్చిదిద్దడంపై ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నెల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ చేపట్టగా..తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఐతే ఈ రోజు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షోకావత్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ దేవసేన ఈ పురస్కారాన్ని పొందనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/