తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను
అందుకే తనపై కుట్ర జరిగిందన్న పృథ్వీరాజ్

తిరుమల: ఉద్యోగిణితో సంభాషణ ఆడియో బయటకు రావడంతో సినీనటుడు పృథ్వీరాజ్‌ను ఎస్‌వీబిసి ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూర్వితంగా తనను ఎస్‌వీబిసి నుంచి తప్పించారని, తనను బయటకు పంపి కొందరు పైశాచికానందం పొందారని చెప్పారు. దీంతో తాను కొన్ని రోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని పృథ్వీరాజ్ ఆరోపించారు. తాను సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. నిరసనలు తెలుపుతున్న అమరావతి రైతులపై తాను చేసిన ‘పెయిడ్ ఆర్టిస్టులు’ వ్యాఖ్యలపై స్పందించారు. రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్‌ఆర్‌సిపిలోనే ఉంటానని చెప్పారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/