రేపు ఏపి మంత్రివర్గం జరిగే అవకాశం!

ap cabinet meeting
ap cabinet meeting

అమరావతి: ఏపిలో ఈరోజు సాయంత్రనికి ఎన్నికల సంఘం నుండి అనుమతి వస్తేనే రేపే మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏపి మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ నెల 10న సాయంత్రం కేబినెట్‌ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పంపారు. నోట్‌ అందిన రెండు పని దినాల్లో తమ అభిప్రాయం చెబుతామని ఈసీ పేర్కొంది. దీంతో ఈసీ నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. అంతేకాక నేటి ఉదయం 10.30 గంటలకు సిఎం చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. రేపటి మంత్రి వర్గ సమావేశంపై ఇవాళ సాయంత్రంలోగా ఈసీ నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ అంశాలపైనే సీఎస్ ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తుంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/