లియోనెల్‌ మెస్సీపై మూడు నెలలపాటు నిషేధం

సమాఖ్యపై చేసిన అవినీతి ఆరోపణలే కారణం

Lionel Messi
Lionel Messi

అసున్‌కియాన్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మూడు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్య (దివీవిలీనితీవీలి)పై అతడు చేసిన అవినీతి ఆరోపణలే ఇందుకు కారణం. దివీవిలీనితీవీలి సమాఖ్య అతడిపై నిషేధంతో పాటు 50 వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. ఈ నిషేధాన్ని అప్పీల్‌ చేసేందుకు మెస్సీకి ఏడు రోజుల సమయం ఉంది. జులైలో నిర్వహించిన కోపా అమెరికా 2019 ప్రపంచకప్‌ పోటీల్లో.. చిలీ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో అర్జెంటీనా 21 తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ అనంతరం మెస్సీ దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ కార్యవర్గంపై అవినీతి ఆరోపణలు చేశాడు. బ్రెజిల్‌ను గెలిపించేందుకు ఈ పోటీల్లో అవినీతి జరిగింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/