కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా

MLA Roshan Baig
MLA Roshan Baig

బెంగళూరు: కర్ణాటకలో వరుస రాజీనామాలతో రాజకీయ సంక్షోభం ఉత్కంఠంగా మారుతుంది. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యె ఈరోజు రాజీనామా చేశారు. వాజీనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్‌ బేగ్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించారు. అయితే రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని రోషన్‌ బేగ్‌ చెప్పడం గమనార్హం. ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేల మాదిరిగా నేను ముంబయికో, ఢిల్లీకో వెళ్లడం లేదు. నేను కర్ణాటక హజ్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నాను అని రోషన్‌ బేగ్‌ తెలిపారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని బేగ్‌ను ఇటీవల కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/