తాహిర్‌ హుస్సేన్‌ను అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

అల్లర్లు జరిగేందుకు ప్రేరిపించారని ఆయనపై అభియోగాలు నమోదు

accused-delhi-violence-tahir-hussain-arrested
accused-delhi-violence-tahir-hussain-arrested

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఐబీ ఉద్యోగి అంకిత్‌ శర్మ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఐబీ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడేలా తాహిర్‌ హుస్సేన్‌ రెచ్చగాట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాహిర్‌ హుస్సేన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల జరిగేందుకు ప్రేరిపించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ రోజ్‌ ఎవెన్యూ కోర్టులో లొంగిపోయేందుకు వెళ్తున్న క్రమంలో తాహిర్‌ హుస్సేను ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంకిత్‌ శర్మ హత్య కేసులో తనపై ఎఫ్‌ఐర్‌ దాఖలైన క్రమంలో ఢిల్లీలోని కర్కర్‌దుమా కోర్టులో తాహిర్‌ హుస్సేన్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/