అమృత్‌స‌ర్‌లో పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు

Suspected Pak Drone Carrying Drugs Shot Down Near Border In Amritsar

అమృత్‌స‌ర్ : పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ వ‌ద్ద అనుమానాస్ప‌దంగా సంచ‌రించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు కూల్చివేశాయి. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇండియా భూభాగంలోకి ప్ర‌వేశించేందుకు య‌త్నించిన డ్రోన్‌ను సోమ‌వారం సైన్యం ప్ర‌క‌టించింది. ఆదివారం రాత్రి 8:50 గంట‌ల‌కు డ్రోన్ సంచ‌రిస్తున్న శ‌బ్దం వినిపించ‌డంతో బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మై.. దానిపై కాల్పులు జ‌రిపి కూల్చేశారు. బ్లాక్ క‌ల‌ర్‌లో ఉన్న డ్రోన్.. 2.70 కిలోల డ్ర‌గ్స్‌ను క‌లిగి ఉన్న‌ట్లు సైన్యం నిర్ధారించింది. పాకిస్తాన్ నుంచి భార‌త్‌కు త‌ర‌లిస్తున్న డ్రగ్స్ స‌ర‌ఫ‌రాను క‌ట్ట‌డి చేస్తున్నామ‌ని సైన్యం తెలిపింది.