కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్‌ నెగిటివ్

వరల్డ్ వైడ్ గా అందర్నీ గజగజలాడిస్తున్న మంకీపాక్స్‌ ..భారతదేశంలోనూ ప్రవేశించింది. ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా..తాజాగా తెలంగాణ లోని కామారెడ్డి కి చెందిన యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అతడిని హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇతడికి సంబదించిన రిపోర్ట్స్ వచ్చాయి. ఇతడికి మంకీపాక్స్‌ నెగిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రిపోర్ట్ తో అధికార వర్గం తో పాటు అంత ఊపిరి పీల్చుకున్నారు.

కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి..ఈ నెల 6న కువైట్‌ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా రాషెస్‌ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్‌ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇరాక్ ఈరోజు ఆ రిపోర్ట్స్ వచ్చాయి. వాటిలో నెగిటివ్ రావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.