మరోసారి జమ్మూకశ్మీర్‌లో డ్రోన్‌ క‌ల‌క‌లం

సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద ఘ‌ట‌న‌

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ మళ్లీ డ్రోన్లు కలకలం రేపింది. సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలోని నాలుగు చోట్ల డ్రోన్‌ కదలికలను గుర్తించినట్లు సాంబ ఎస్‌ఎస్‌పీ రాజేశ్ శర్మ సోమవారం తెలిపారు. వాటిలో ఒక‌టి ఆర్మీ క్యాంప్ వద్ద కూడా తిరిగింది. డ్రోన్లు దూరంగా సంచరించ‌డంతో కాల్పులు జ‌రిపినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు వాటిపై కాల్పులు జరపలేదని అధికారులు చెప్పారు. డ్రోన్ల సంచారంపై జమ్మూకశ్మీర్ పోలీసులు 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం ఇచ్చారు. కాసేప‌టికి డ్రోన్లు అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది.


కాగా, డ్రోన్ల ద్వారా ఉగ్ర‌వాదులు ఆయుధాలు పంపుతుండడంతో భార‌త సైనికులు ఇప్ప‌టికే అనేక సార్లు ఉగ్ర‌వాదుల చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ, గ‌త అర్థ‌రాత్రి జ‌మ్మూక‌శ్మీర్ లోని సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద నాలుగు డ్రోన్లు సంచ‌రించ‌డం గ‌మ‌నార్హం.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/