ముగిసిన సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు

కన్నీటి వీడ్కోలు

Sushma Swaraj's Funeral
Sushma Swaraj’s Funeral

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో ఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన సుష్మా స్వరాజ్‌ పార్థివ దేహాన్ని తొలుత ఆమె నివాసానికి తరలించారు. అనంతరం బుధవారం ఉదయం కార్యకర్తలు, నేతల సందర్శనార్థం బిజెపి కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య
ఢిల్లీ వీధుల్లో సుష్మా స్వరాజ్‌ అంతిమ యాత్ర కొనసాగింది. అనంతరం లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె పార్థివ దేహానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల అశ్రు నయనాల మధ్య ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/