అమిత్ షా అపరచాణుక్యుడిలా వ్యవహరించారు

భారత రాజకీయాల్లో తానేంటో మరోసారి రుజువు చేసుకున్నారు

Sushil Modi
Sushil Modi

బీహార్‌: మహారాష్ట్రలో రాత్రికి రాత్రే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయించి బిజెపి జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపరచాణుక్యుడిలా వ్యవహరించారని, భారత రాజకీయాల్లో తానేంటో మరోసారి రుజువు చేసుకున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేడయంతో అమిత్ షా కీలకపాత్ర పోషించారని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన సమయంలోనే తమ పార్టీ జాతీయాధ్యక్షుడు వేసిన రాజకీయ ఎత్తుగడ తమకు సానుకూల ఫలితాన్నిచ్చిందన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/