సూర్య చిత్రానికి గునీత్‌ మోంగా దర్శకత్వం

guneet monga
guneet monga, oscar awrd winner


చెన్నై: ప్రముఖ నటుడు సూర్య ఆస్కార్‌ అవార్డు విజేత గునీత్‌ మోంగా తెరకెక్కించబోయే చిత్రంలో నటించనున్నాడు. ఇటీవల జరిగిన 91వ ఆస్కార్‌ వేడుకలో ప్రముఖ దర్శకురాలు గునీత్‌ మోంగా..పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ ఎ సెంటెన్స్‌ అనే డాక్యుమెంటరీ చిత్రానికి గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సూర్యతో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. త్వరలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.