రైనా సేవల్ని ప్రశంసిస్తూ ప్రధాని లేఖ

థ్యాంక్స్ చెప్పిన క్రికెట‌ర్‌ రైనా

PM Modi letter to Suresh Raina

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి క్రికెటర్‌ సురేశ్‌ రైనా సేవల్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో రైనా త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. త‌న‌ను మెచ్చుకుంటూ లేఖ రాసినందుకు ప్ర‌ధాని మోడికి రైనా థ్యాంక్స్ చెప్పారు. దేశం కోసం ఆడిన‌ప్పుడు ర‌క్తం, చెమ‌ట చిందిస్తామ‌ని, దేశ ప్ర‌ధాని మా సేవ‌ల్ని గుర్తించి ప్ర‌శంసించ‌డం క‌న్నా గొప్ప విష‌యం ఏమీ ఉండ‌ద‌ని రైనా త‌న ట్వీట్‌లో తెలిపారు. విన‌మ్రంగా ప్ర‌ధాని ప్ర‌శంస‌ల‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు రైనా తెలిపారు.

బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రైనా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌ట్లు ప్ర‌ధాని మోడి త‌న లేఖ‌లో పేర్కొన్నారు. 2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీలో.. అహ్మ‌దాబాద్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌ను తిల‌కించాన‌ని, ఆ మ్యాచ్‌లో రైనా పాత్ర‌ను మ‌రిచిపోలేన‌ని ప్ర‌ధాని త‌న లేఖ‌లో గుర్తు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట కోసం నువ్వు ఆడ‌లేద‌ని, జ‌ట్టు కోసం, దేశం కోసం ఆడావంటూ రైనాను ప్ర‌ధాని కీర్తించారు. మాజీ కెప్టెన్ ధోనీతో పాటు రైనా కూడా ఆగ‌స్టు 15న రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/