దుర్గగుడికి కొత్త ఈవోగా సురేశ్‌బాబు

విజయవాడ: కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో సురేష్‌బాబును నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను ఇక్కడి నుంచి బదిలీ చేసినప్పటికీ ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సురేష్ బాబు ఇప్పటివరకు అన్నవరం దేవస్థానం ఈవోగా విధులు నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు ఆలయ వేదపండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దివ్యాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహామండపం ఏడో అంతస్తులో ఉన్న ఈవో కార్యాలయంలో సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుర్గ గుడి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/